ఎంపీ ‘ గ‌ల్లా ‘ జోరుకు బ్రేక్ వేసిందెవ‌రు.. ఈ అవ‌మానం క‌థేంటి…!

-

నాయ‌కుల‌కు ఎంత వాగ్ధాటి ఉంద‌నేది ప్ర‌ధానం కాదు.. స‌బ్జెక్ట్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్ అంటూ.. గ‌తంలో పీఎంగా చేసిన పీవీ న‌ర‌సింహారావు.. పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్య నేటికీ అక్ష‌ర స‌త్యం. ఎ న్ని భాష‌లు వ‌చ్చు.. భాష‌ను ఎన్ని మ‌లుపులు తిప్పి.. ఎంత అందంగా మాట్లాడ వ‌చ్చు.. అనేది కాదు.. ప‌స ఉండాల‌నేదే కీల‌కం. ఇప్పుడు ఇవి ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోందంటే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విషయంపై టీడీపీ భారీ ఎత్తున పోరు సాగిస్తోంది. ఈ క్ర‌మంలో అవ‌కాశం ఉన్న ప్ర‌తి అంశాన్నీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటోంది. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.

ఈ స‌మావేశాల్లో ఏపీ అమ‌రావ‌తి త‌ర‌లింపును ప్ర‌ధానంగా కేంద్రం దృష్టికి తీసుకువ‌చ్చి.., పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు పెట్టి దేశంలోనే కీల‌క టాపిక్ చేసి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై జాతీయ నేత‌ల‌తో మొట్టికాయ‌లు వేయిం చాల‌ని టీడీపీ భావించింది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే, ఈ విష‌యంలో ప‌స‌లేని వాద‌న చేయడ మే ఆ పార్టీకి, నేత‌ల‌కు కూడా తీవ్ర మైన‌స్ అయింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. పార్ల‌మెంటులో వాగ్ధాటి ప్ర‌ద‌ర్శించి జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టాల‌ని టీడీపీ నాయ‌కుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో జ‌య‌దేవ్ ఎత్తున అంశాలు స‌రికాద‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి రైతుల్లో కానీ, అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని కోరుతున్న వారిలో కానీ.. కేంద్ర ప్ర‌భుత్వంపై కొంత మేర‌కు ఆశ‌లు ఉన్నాయి. మోడీ వ‌చ్చి అడ్డు ప‌డిపోతాడ‌ని, జ‌గ‌న్‌కు జ‌ల్ల కాయ ఖాయ‌మ‌ని వారు న‌మ్ముతున్నారు. ప్ర‌చారం కూడా చేస్తున్నారు. ఈస‌మ‌యంలో ఈ అంశాన్ని మ‌రి కొన్ని రోజులు కొన‌సాగించి ఉంటే బాగుండేది. కానీ, గ‌ల్లా మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శించారు. నేరుగా ఈ విష‌యంలో కేంద్రాన్ని లాగే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌ధానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల‌ని అడిగేశారు. దీంతో ఏ మాత్రం త‌డుముకోకుండా.. కేంద్రం పార్ల‌మెంటులోనే త‌మ‌కు, ఏపీ రాజ‌ధానికీ సంబంధం లేద‌ని, ఈ విష‌యం రాష్ట్ర ప‌రిధిలోనిద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

నిజానికి ఈ ప‌రిణామం.. అమ‌రావ‌తి ఉద్య‌మారుల ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించింది. పార్ల‌మెంటులో ఈ ప్ర స్థావ‌న తీసుకురాకుండా ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముందుగా మోడీని లేదా బీజేపీని ఈ దిశ‌గా ఒప్పించి, ఆ త‌ర్వాత అభిప్రాయం కోరి ఉంటే ఫ‌లితం ఉండేద‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి. ఇక‌, ఇదేస‌మ‌యంలో పోలీసులు త‌న‌ను కొట్టార‌ని, త‌న‌కు అవమానం జ‌రిగింద‌న్న గ‌ల్లా వ్యాఖ్య‌లు కూడా తేలిపోయాయి. అంత ఆందోళ‌న జ‌రుగుతున్న స‌మ‌యంలో బాధ్య‌తా యుత‌మైన ప్ర‌జాప్ర‌తినిధి అక్క‌డ‌కు ఎందుకు వెళ్లార‌న్న వైసీపీ ఎంపీల ఎదురు ప్ర‌శ్న‌కు ఆయన స‌భ‌లో స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా .. మొత్తంగా చూసుకుంటే.. గ‌ల్లా దూకుడుకు కేంద్రం నుంచి బ్రేకులు ప‌డ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news