పరిటాల కుటుంబంపై ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..చెప్పుతో కొట్టండి !

పరిటాల కుటుంబంపై ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల భూఆక్రమణ చేశారని.. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారు.. కొన్ని పోర్జరీ సంతకాలతో చేశారని ఆరోపించారు. ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ భూములను చట్ట బద్ధత చేసి కాజేశారని… వీటిపై ఇటీవల ఆదారాలతో సహా సేకరించాను.. అందుకే బయట పెడుతున్నానని ఛాలెంజ్‌ చేశారు.

కురుగుంట, రాచానపల్లి, కొడిమి, ప్రసన్నాయపల్లి ప్రాంతాల్లో భూములు కేజేశారని… 2 వందల కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగిందన్నారు. మేము బయట పెట్టకుంటే ఏదో ఒక రూట్లో దానిని సెట్ చేస్తారని… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు ఎవరు వెళ్లినా స్టేలు వచ్చేస్తున్నాయని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలు అసలు చూడటం లేదు.. కోర్టులను అలా మార్చేశారని… ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ కొందరు నా పేరు వాడుకుంటున్నారని చెప్పారు. ఇలా ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి.. ఆ తర్వాత నాక్ కాల్ చేయండన్నారు. పరిటాల అనుచరులు కూడా నా పేరు వాడుకునే స్థాయికి దిగజారారని…. దీనిపై కలెక్టర్ కు చేశాం, త్వరలో సీఎంకు ఫిర్యాదు చేస్తున్నామని స్పష్టం చేశారు.