కాశీం గురించి సంచలన విషయాలు, అతని పేరు అది కాదు…!

-

ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ ఖాసీం అరెస్ట్ పై హైకోర్ట్ లో పోలీసులు కౌంటర్ దాఖలు చేసారు. ప్రొఫెసర్ కాశీం తో పాటు మావోయిస్ట్ భావజాలమున్న వాళ్ళు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతున్నారని పోలీసులు ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ లతో ప్రొఫెసర్ కాశీంలాంటి వాళ్ళు, నిరంతరం సంభాహిస్తూ ఉంటారని కౌంటర్ ఫైల్ లో పోలీసులు పేర్కొన్నారు.

సంభాషణల విషయంలో మావోయిస్ట్ లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, డీకోడ్ చేయలేని విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో సంభాషణలు చేస్తున్నారని పోలీసులు వ్యాఖ్యానించారు. మావోయిస్ట్ లతో మాట్లాడేటప్పుడు, కాశీం తన పేరుని కార్తీక్ గా పెట్టుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించే ప్రొఫెసర్ ఖాసీం ని అరెస్ట్ చేసామని పోలీసులు కౌంటర్ ఫైల్ లో పేర్కొన్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ నెల మొదటివారంలో కాశీం ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మావోయిస్ట్ లతో సంబంధాలు ఉన్నాయని, వాళ్లకు ఆయుధాలతో పాటుగా కీలక సమాచారం ఖాసీం అందిస్తున్నారని… ఇక వాళ్ళు ఇచ్చే నిధులతో నడుస్తున్న తెలంగాణా అనే సంచికను భార్యతో కలిసి ఆయన నడిపిస్తున్నారని కోర్ట్ కి పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news