ఒక దోషి క్షమాభిక్ష అభ్యర్ధన మాత్రమే పెండింగ్‌లో ఉందని, మిగతా వారిని ఉరి తీయవచ్చని తీహార్ జైలు అధికారులు శుక్రవారం ఢిల్లీ కోర్ట్ ముందు స్పష్టం చేసారు. నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను ఫిబ్రవరి 1 న ఉరితీయాలని కోరుతూ. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ముందు ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసారు తీహార్ జైలు అధికారులు.
దీనిని దోషుల న్యాయవాది తప్పుబట్టారు. ఒక దోషి అభ్యర్ధన పెండింగ్ లో ఉన్నప్పుడు మిగిలిన వారిని ఉరి తీయలేమని నిభందనలు అదే చెప్తున్నాయని… కోర్ట్ కి విన్నవించారు. పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, మరియు అక్షయ్ కుమార్ తరుపు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ ఉరి శిక్షను వాయిదా వెయ్యాలని వినయ్ పిటీషన్ పెండింగ్ లో ఉండటంతో ఎవరిని ఉరి తీయవద్దని కోరారు.
ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు తిహార్ జైలులో కేసులో ఉన్న నలుగురు దోషులను ఉరితీయడానికి ట్రయల్ కోర్టు రెండవసారి డెత్ వారెంట్ జారి చేసింది. అంతకుముందు జనవరి 7 న కోర్టు జనవరి 22 ను ఉరి తేదీగా కోర్ట్ నిర్ణయించినా అది వాయిదా పడుతూ వచ్చింది. దీనితో వాళ్ళు ఉరి తీస్తారో లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.