ఏటా వచ్చే ఫిబ్రవరి మాసానికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పైనే ఎక్కువగా అందరి దృష్టీ ఉంటుంది. ముఖ్యంగా ఏపీ వాసులైతే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, ప్రతి సారీ కూడా ఏపీ ప్రజల ఆశలు ఆశించిన విధంగా నెరవేరడం లేదనేది వాస్తవం. మరీముఖ్యంగా ప్రజా రవా ణాకు కీలకమైన రైల్వేల విషయానికి వస్తే.. ఏపీలో బ్రిటీష్ కాలంలో వేసిన రైల్వేలైన్లు, బ్రిడ్జీలతోనే ఇప్పటి వరకు కాలం గడిచిపోయింది. దీంతో కొన్ని పాతబడిపోగా.. మరిన్ని ప్రాజెక్టులకు కాలదోషం పట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రరైల్వే అభివృద్దికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆలోచన ఏపీలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విషయం.
ఏపీ రైల్వేల విషయానికి వస్తే.. చాలా వరకు ప్రాజెక్టులకు యూపీఏ ప్రబుత్వ హయాంలోనివేదికలకు ఎక్కా యి. అధ్యయనం కూడా సాగించాయి. తర్వాత ప్రభుత్వం మారి మోడీ అధికారంలోకి రావడంతో ఉత్తరా దిపై ఉన్న ప్రేమను ఆయన ఏపీపై చూపించలేక పోతున్నారనే వాదన ప్రబలంగా ఉంది. ఏపీ నుంచి బీజే పీకి పెద్దగా సారధ్యం లేక పోవడం, బీజేపీకి ఇక్కడ ప్రయోజనాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం తో ఇక్కడి ప్రాజెక్టులపై నీలి నీడలు ముసురుకున్నాయి.
ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రజలు రైల్వే బడ్జెట్ విషయంపై ఆశలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక, మోడీ అధికారంలోకి వచ్చాక సార్వత్రిక బడ్జెట్ లోనే రైల్వేను కలిపేశారు. గత బడ్జెట్‌ను పరిశీలిస్తే.. కొన్ని ప్రాజెక్టులకు అరకొర నిధులే కేటాయిస్తున్నారు. కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వే కు గతబడ్జెట్‌లో.1లక్ష మాత్రమే కేటాయించారు. ఈ లైన్ సర్వే దశను దాటకపోవడం గమనార్హం. ఇక, భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ గురించి గత బడ్జెట్లో ప్రస్తావనే లేదు.
జిల్లాలో రెండు కొత్త రైలుమార్గాలు సర్వేలకే పరిమితమైయ్యాయి. కడప–గుంతకల్లు–బళ్లారి రైల్వేలైన్ సర్వేకు బడ్జెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కడప–గుంతకల్లు మధ్య డబుల్‌లైన్ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈ లైను అనువుగా ఉంటుంది. అయితే, సర్వే చేపట్టేందుకు ఆమోదం లభించినా అడుగు ముందుకు పడలేదు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేల పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.