కేంద్రం తెలంగాణ పట్ల కక్ష చూపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అనే పదం పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదన్నారు. వివక్ష లేకుండా తానే స్వయంగా ప్రధాని మోడీని కలిసినట్టు వివరించారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి మంత్రులు, తాను కోరామని తెలిపారు.
ఏపీ పునర్విభజన చట్టంలో చట్టంగా భాగంగా ఏపీకి నిధులు ఇచ్చినట్టు.. తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణకు లేదా అని ప్రశ్నించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానే మీ మీ ప్రాంతాలకు ఏవిధంగా కేటాయించుకున్నారో.. మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు. ఈ బడ్జెట్ చూస్తే.. తెలంగాణ పై ఎంత కక్ష ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఏపీకి ఎ:దుకు ఇచ్చారని మేము అడగడం లేదు. కానీ ఏపీతో పాటు తెలంగాణకు ఇవ్వాలని అడుగుతున్నాం. రైతులకు ఆదుకోవడానికి తెలంగాణకు ఏదీ ఇవ్వలేదు స్పష్టం చేశారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్ అని బీజేపీ నిరూపించింది.