దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మూడు లక్షలపైన నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ మహమ్మారి వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. సెకండ్ వావ్ ముగియముందే.. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్ న్యూస్ చెప్పింది. జూలైలో పిల్లలపై ‘నోవావాక్స్‘ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని భావిస్తోంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.