బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం విదితమే. అయితే నోవావాక్స్ అనే మరో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. ఇక కరోనా వ్యాక్సిన్‌ను భారత ప్రజల కోసం ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. దేశంలో ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేయగా.. దానికి ప్రస్తుతం మొదటి దశ ట్రయల్స్ ముగిశాయి. రెండు, మూడు దశల ట్రయల్స్‌కు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే డీసీజీఐ నుంచి అనుమతులు పొందింది. అయితే 2021వ వరకు దాదాపుగా అన్ని దేశాల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్‌లో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో రెండో దశ ట్రయల్స్ ను ఇటీవలే చేపట్టారు. కాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఆరంభంలో 100 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసి అందివ్వనుంది.
కాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, నోవావ్యాక్స్ కు చెందిన కరోనా వ్యాక్సిన్లను 92 దేశాల్లో బిల్‌గేట్స్‌కు చెందిన గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ గవి అనే సంస్థకు చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిటీ (ఎంఎంసీ)తోపాటు ఇటు సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు కూడా సపోర్ట్‌ను ఇవ్వనుంది.