లాక్ డౌన్ లో నానా ఇబ్బందులు ఒక పక్కన ప్రజలు పడుతుంటే జరుగుతున్న ఆన్లైన్ మోసాలు ప్రజలను బాగా కంగారు పెడుతున్నాయి. తాజాగా విజయవాడ లో కొన్ని వింత మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న బెజవాడ పోలీసులు హెచ్చరించారు. ఆన్ లైన్ కోర్సుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.
లాక్ డౌన్ నేపధ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రారంభించలేదని… కొన్ని విద్యా వ్యాపార సంస్థలు దీనిని అనుకూలంగా మార్చుకుని ఇంటరాక్ట్ కోర్సులు, వీడియో లెర్నింగ్, వంటి రకరకాల పద్దతులతో కోర్సులను ఆఫర్ చేస్తున్నారని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి వాటిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని ప్రముఖ కంపెనీ ప్రకటనలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి పలు కోర్సులు నేర్పిస్తామంటూ డబ్బులు దండుకుంటున్నారని, ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.