డబ్బు కావాలనుకుంటే ఆ సినిమాలు చేసేదాన్ని…!

-

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ సినిమాలో విజయ్ తో ముద్దుల హంగామా సృష్టించిన షాలిని పాండే ఆ సినిమా సక్సెస్ తర్వాత అలాంటి సినిమాలే ఛాలా వచ్చాయని మంచి రెమ్యునరేషన్ ఆఫర్స్ కూడా వచ్చాయని చెప్పింది. అయితే ఇండస్ట్రీకి డబ్బు కోసమే రాలేదని అందుకే ఆ సినిమాలను చేయలేదని అన్నది షాలిని పాండే.

అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు కాలేదు. రీసెంట్ గా కళ్యాణ్ రాం 118 సినిమాలో నటించింది షాలిని పాండే. ఈ సినిమా సక్సెస్ తనకు మంచి సంతృప్తిని ఇచ్చిందని తన మనసుకి నచ్చిన కథలనే ఓకే చేస్తానని.. అది చిన్నదా పెద్ద సినిమానా అని చూడనని అంటుంది షాలిని పాండే. కేవలం డబ్బు కోసమే అయితే అర్జున్ రెడ్డి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయాని వాటిని చేస్తే బాగా సంపాదించే దాన్నని చెప్పుకొచ్చింది షాలిని పాండే. రానున్న రోజుల్లో ప్రయోగాలకు తాను సిద్ధమని స్క్రిప్ట్ బలంతోనే తన సినిమాల ఎంపిక ఉంటుందని షాలిని పాండే వెళ్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news