హిట్ 7 లో ఏడుగురు హీరోలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాని..!

-

నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి హీరోగా నటిస్తున్న హిట్ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ” ఏ సర్టిఫికెట్” ఇచ్చి సెన్సార్ బోర్డు నిర్వాహకులు కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా నిర్వహించగా ముఖ్యఅతిథిగా రాజమౌళి విచ్చేశారు.

అయితే ఈ ఈవెంట్ లో భాగంగా నాని మాట్లాడుతూ..” హిట్ ది ఫస్ట్ కేస్.. కంటే హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హిట్ ఫ్రాంచైజీలు ఇంకా మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు సినిమాలు ఉంటాయి. హిట్ ఏడవ పార్ట్ లో అన్ని పార్ట్ ల్లో నటించిన హీరోలు కనిపిస్తారని.. వాళ్ళందర్నీ ఒక సమస్య పరిష్కారం కోసం తీసుకొస్తానని నాకు డైరెక్టర్ చెప్పాడు.. ఒక నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఈ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ ఈ సినిమా గురించి అసలు విషయాన్ని వెల్లడించారు నాని.

ఇకపోతే హిట్ ఫ్రాంచైజ్ లపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా హిట్ సెవెన్ లో ఏడుగురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికైతే మొదటి భాగంలో విశ్వక్ సేన్ నటించగా.. రెండవ భాగంలో అడవి శేష్ నటిస్తున్నారు. మరి మూడవ భాగం.. ఆ తర్వాత భాగాలలో ఏ హీరోలు వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news