కేంద్ర ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. త్వ‌ర‌లో పాత పెన్ష‌న్..!

-

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. త్వ‌ర‌లో పాత‌పెన్ష‌న్ స్కీమ్ ప్ర‌యోజ‌నాన్ని పొందే అవ‌కాశాలున్నాయి. ఈ డిమాండ్‌ను ఉద్యోగులు చాలా కాలంగా ప్ర‌భుత్వం ముందుంచారు. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కూడా కోరింది. ఇప్పుడు మంత్రివ‌ర్గం నుంచి స‌మాధానం కోసం వేచి ఉంది. వాస్త‌వానికి డిసెంబ‌ర్ 31, 2003కి ముందు రిక్రూట్ మెంట్ అయిన ఉద్యోగులు ఓల్డ్ పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాన్ని పొందుతారు.

అయితే జ‌న‌వ‌రి 01, 2004 లేదా అంత‌కు ముందు రిక్రూట్‌మెంట్ కోసం ప్ర‌క‌ట‌న జారీ చేసిన ఉద్యోగుల‌ను ఎన్‌పీఎస్ నుంచి మిన‌హాయించ‌డం గురించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది. వారు ఓల్డ్ పెన్ష‌న్ ప్ర‌యోజ‌నానికి అర్హులు అవుతార‌ని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణ‌యానికి అనుగుణంగా పెన్ష‌న్‌, పెన్ష‌న‌ర్ల సంక్షేమ శాఖ ఆ ఉద్యోగుల‌ను ఎన్‌పీఎస్ నుంచి మిన‌హాయించాల‌ని ఆర్థిక సేవ‌ల శాఖ న్యాయ‌మంత్రిత్వ శాఖ‌ను కోరినట్టు మంత్రి వివ‌రించారు.

వీరి నియామ‌క ప్ర‌క‌ట‌న‌లు 31 డిసెంబ‌ర్ 2003 లేదా అంత‌కు ముందు జారీ చేయ‌బ‌డిన‌వని పేర్కొన్నారు. ఈ కాలంలో రిక్రూట్ అయిన ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఓల్డ్ పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయా లేదంటే మొత్తం ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తాయా అనేది ప్ర‌భుత్వం ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news