ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆ వివరాలు…
తెలుగు చిత్రసీమలో 50 ఏళ్లకుపైగా హీరోగా, విలన్గా అలరించిన నటుడు కృష్ణంరాజు మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. “కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం” అంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/9xSQVkm2kU
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 11, 2022
దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు విచారం వ్యక్తం చేశారు. సోదర సమానుడైన కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
I am at loss of words! #KrishnamRaju my brother.
— Mohan Babu M (@themohanbabu) September 11, 2022