కరోనా ఎఫెక్ట్: పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..

Join Our COmmunity

కరోనా వచ్చినప్పటి నుండి పాజిటివిటీ అంటేనే ఒక నెగెటివ్ ఆలోచన మైండ్ లోకి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో అసలైన పాజివిటీని ఊహించగలగడం కొంచెం కష్టమే. తాజా అధ్యయనం ప్రకారం కరోనా వచ్చినప్పటి నుండి పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజర్లలో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయట. పాఠశాలలు తెరుచుకుంటాయా లేదా అన్న అనుమానాలు, పై తరగతికి వెళ్తామా లేదా అన్న సందేహాలు, పరీక్షలు ఉంటాయా ఉండవా అన్న ఆలోచనలు, జీవన విధానంలో నెలకొన్న గజిబిజి.. మొదలగునవి వారిలో నెగెటివిటీని పెంచుతున్నాయని అంటున్నారు.

పిల్లల హక్కులని పరిరక్షించే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో 1598మంది తల్లిదండ్రులు. 989మంది పిల్లలు పాల్గొన్నారు. దీని ద్వారా తేలిన విషయం ఏమిటంటే, నలుగురిలో ముగ్గురు పిల్లలు నెగెటివ్ ఆలోచనలకి గురవుతున్నారని తెలిసింది.

పాఠశాలలు తెరుచుకుంటాయో లేదో అన్న సంధిగ్ధం, తమ స్నేహితులు, ఉపాధ్యాయులతో కనుమరుగవుతున్న కాంటాక్ట్, కుటుంబ పరంగా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు మొదలగునవన్నీ పిల్లల్లో ప్రతికూల ఆలోచనలకి ఆస్కారం కలిగిస్తున్నాయని చెబుతున్నారు.

బ్రతుకుదెరువు కోసం పట్టణాలకి వలస వెళ్ళిన కుటుంబాల్లో ఆదాయం లేకపోవడం, తినడానికి ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు రావడం వల్ల ఆ కుటుంబాల్లో ఉండే పిల్లల్లో సమాజం పట్ల ఒకరకమైన నెగెటివ్ దృక్పథం ఏర్పడిందని సర్వేలో వెల్లడయ్యింది. తల్లిదండ్రులు తమ ఉద్యోగాలని కోల్పోవడంతో జీవన విధానంలో మార్పులు రావడం కారణంగా పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రేకెత్తుతున్నాయని తెలుస్తుంది. కరోనా వచ్చినప్పటి నుండి మొదలైన ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి. ఇలాంటి ఇబ్బందులకి కారణమైన కరోనా ఎప్పుడు వదిలిపెడుతుందో ఏమో..!

 

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...