చాలా రోజులుగా భారత్ మహిళా రెజ్లర్లు మాకు న్యాయం చేయండి అంటూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. వీరిని రెజ్లర్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని వీరు రోడ్డెక్కి న్యాయం కోసం నిరసనలకు దిగారు. కానీ ఎవ్వరూ వీరిని పట్టించుకోలేదు..రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరుగా వీరికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇతనిపై కేసు కోర్ట్ కు వెళ్ళింది, ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోర్ట్ విచారణ కూడా చేసింది. కాగా ఈ లోపు బ్రిజ్ భూషణ్ తరపు లాయర్ బెయిల్ కోసం అప్లై చేశాడు… ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్ట్ ఈ రోజు ఆయనకు బెయిలు ఇచ్చింది.
కాగా ఈయనతో పాటుగా అతని పిఎ వినోద్ తోమర్ సింగ్ కు రెండు రోజుల మధ్యంతర బెయిలు ను మాత్రమే ఇచ్చింది. కాగా ఈ కేసులో బెయిల్ లభించడంతో మహిళా రెజ్లర్లు ఫీల్ అయి ఉంటారు.