18 సంవత్సరాలకే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్ … !

-

మాములుగా ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ కెరీర్ గా దక్కాలంటే ఎంతో కష్టం మరియు అదృష్టం ఉండాలి. అలాంటి ఎంతో టాలెంట్ ఉన్న పాకిస్తాన్ క్రికెట్ లో రెగ్యులర్ మహిళా క్రికెటర్ గా కొనసాగుతున్న అయేషా నసీం తన లైఫ్ లో ఎవ్వరూ తీసుకోలేని నిర్ణయం తీసుకుని ప్రపంచంలో క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్న ఎంతో మంది క్రికెటర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీం (18) కు చిన్న వయసులోనే దేశానికి ఆడే అవకాశం దక్కింది. అయితే ఈమె తన కెరీర్ ను అందరి లాగా వయసు ఎక్కువ అయ్యే వరకు కొనసాగించకుండా సడెన్ గా రిటైర్మెంట్ ను ప్రకటించింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా, ఈమె ఇకపై తన జీవితాన్ని ఇస్లాం మతం ప్రకారం నడుచుకోవాలి అని ఈ నిర్ణయం తీసుకుంది అని తెలిపింది.

కాగా ఈమె తన క్రికెట్ కెరీర్ లో 4 వన్ డే లు మరియు 30 టీ 20 లు ఆడింది. ఈమె రిటైర్మెంట్ గురించి చాలా మంది పాక్ క్రికెటర్లు బాధకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news