నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత మంచి సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాని కెరీర్లో మాంచి ఎమోషనల్ మూవీగా నిలిచింది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించాడు. ఐతే ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ చిత్రీకరణ పూర్తయ్యింది.
తాజాగా ఈ విషయమై ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసిన షాహిద్, జెర్సీ ప్రయాణం ఒక అద్భుతమని, మనస్సుకు హత్తుకుందని తెలిపాడు. మహమ్మారి టైమ్ లో 47రోజుల పాటు చిత్రీకరణ జరిపామని, అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్, మరో తెలుగు చిత్రం జెర్సీ రీమేక్ తో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి. జెర్సీ హిందీ రీమేక్ ని కూడా గౌతమ్ తిన్ననూరే డైరెక్ట్ చేసాడు.
It’s a film wrap on #jersey…. 47 days of the shoot during covid. Just unbelievable. I am so proud of the entire team. It’s nothing short of a miracle. I want to thank each & everyone from the unit for coming to set every day, putting themselves at risk & doing what we all love. pic.twitter.com/KjXCNMOBlD
— Shahid Kapoor (@shahidkapoor) December 15, 2020