9మిలియన్ల అశ్లీల వీడియోలని తొలగించిన టాప్ సైట్.. కారణమేంటంటే..

-

ఇంటర్నెట్ లో అశ్లీల వీడియాలు అందుబాటులో ఉంచే పోర్న్ హబ్ వెబ్ సైట్, తాజాగా 9మిలియన్ల వీడియోలని తొలగించింది. అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి, బలవంతంగా తీసిన వీడియోలు, టీనేజర్లని నటింపజేసిన వీడియోలని పూర్తిగా తొలగించింది. ఇటీవలే వీసా, మాస్టర్ కార్డ్ తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాక ఈ సంఘటన జరిగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన కథనం ప్రకారం అనధికార వీడియోలు, టీనేజర్ల వీడియోలు వేలల్లో ఉన్నాయని తెలిపింది.

దాంతో అప్రమత్తమైన సైట్ అలాంటి వీడియోలన్నింటినీ పూర్తిగా తొలగించేసింది. ప్రస్తుతం ఎవరు పడితే వారు పోర్న్ హబ్ లో వీడియోలని అప్లోడ్ చేయడానికి వీలు లేదు. ధృవీకరించబడిన వ్యక్తులు మాత్రమే వీడియోలని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ధృవీకరించబడని ఖాతాలన్నింటినీ రద్దు చేసింది. ఈ మేరకు సైట్ యాజమాన్యం బ్లాగు ద్వారా స్పందిస్తూ, అనధికార వ్యక్తుల ద్వారా వచ్చే వాటిని మేము నిలిపివేయగలిగాం. మాలాగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటివి చేయగలవా అని ప్రశ్నించారు.

ఈ సైటులో వీడియోలని అప్లోడ్ చేయడానికి ఆ వ్యక్తి తన ఫోటో ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సైటు నుండి అనుమతి వచ్చిన తర్వాతే వీడియోలని అప్లోడ్ చేసే వీలుంటుంది. ఐతే దీనివల్ల చాలా మంది సెక్స్ వర్కర్లకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా సెక్స్ వర్కర్ల వ్యాపారం దెబ్బతింది. అందువల్ల సైటులో వీడియోలు అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించారు.

9మిలియన్ల వీడియోలని తొలగించిన కారణంగా, ప్రస్తుతం సైటులో 4మిలియన్ల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఐతే ఇలాంటి భారత ప్రభుత్వం చాలా రోజుల క్రితమే నిషేధించింది.

Read more RELATED
Recommended to you

Latest news