నాకు మంచు విష్ణు న్యాయం చేయాలి.. యువతి డిమాండ్..!

నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడంటూ బోయ సునీత అనే యువతి ఫిలిం ఛాంబర్ ముందు అప్పట్లో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. తనకు తానే గొలుసులతో బంధింకుని సునీత ఛాంబర్ ముందు నిరసనకు దిగింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బన్నీ వాసు పరిచయమయ్యాడని… ఆ తర్వాత తాము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు కడుపు చేసి అబార్షన్ చేయించాడని యువతి ఆరోపించింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఎలాంటి ఆధారాలు చూపించడంలేదని… అంతేకాకుండా యువతి మానసిక పరిస్థితి బాగా లేదని నిర్ధారించారు.

అయితే సునీత మరోసారి అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ కేసును దిశకు అప్పగించగా డిఎస్పీ శ్రీనివాసులు విచారణ జరిపి అసలు విషయాలు బయట పెట్టారు. యువతి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. సునిత తో పాటు ఆమె తల్లిని కూడా విచారించామని తెలిపారు. అంతేకాకుండా సునీత పై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సరైన ఆధారాలు తీసుకొస్తే సునీత కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే న్యాయం కోసం రెండేళ్లుగా పోరాడుతున్నా అని మా అధ్యక్షుడు మంచు విష్ణు తనకు న్యాయం చేయాలని సునీత డిమాండ్ చేస్తోంది.