ప్రమాదంలో స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ రికార్డ్…!

-

ఆస్ట్రేలియా క్రికెట్ అంటేనే ఎన్నో రికార్డుల పరంపర, విశ్వవిజేతగా అత్యధిక సార్లు నిలిచిన జట్టుగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో వరుసగా రెండు ఓటముల తగిలక వెంటనే తేరుకుని హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని సెమీస్ రేస్ లో నిలిచింది ఆస్ట్రేలియా. ఇక తాజాగా నెదర్లాండ్ పై 309 పరుగుల భారీ తేడాతో వరల్డ్ కప్ హిస్టరీ లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంలో సూపర్ బౌలింగ్ తో కీలక పాత్ర పోషించిన జంపా దివంగత మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ రికార్డుకు ఎసరు పెట్టేలా ఉన్నాడు. వన్ డే లలో ఆస్ట్రేలియా తరపున 13 సార్లు నాలుగు వికెట్లు తీసుకున్న స్పిన్నర్ గా షేన్ వార్న్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జంపా ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా 12 సార్లు అయింది. ఇక మరొక్కసారి కనుక జంపా నాలుగు వికెట్లు తీసుకుంటే వార్న్ రికార్డును సమం చేస్తాడు..

రెండు సార్లు నాలుగు వికెట్లు అందుకుంటే వార్న్ కన్నా ముందు స్థానానికి చేరుకుంటాడు. మరి ఈ రికార్డును ఈ వరల్డ్ కప్ లోనే అందుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news