ద్వారకాధీశుని ఆలయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ సందర్శించారు. దేవ్ భూమిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబానీ.. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ తో కలిసి గుజరాత్ రాష్ట్రం దేవ్భూమి ద్వారకా జిల్లాకు మంగళవారం వెళ్లారు. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని సందర్శించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీకి శాలువాలతో సత్కరించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ద్వారకలోని దేవ్ భూమిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.