తెలంగాణాలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజు 1000 నుండి 2000 లోపు కరోన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ అలానే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంత తక్కువే అయినా తెలంగాణ వరకు ఈ కేసులు భారీగా నమోదు అవుతున్నయనే చెప్పాలి. ఇక మొదట్లో సామాన్యుల వరకు పరిమితం అయిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కూడా సోకుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే తెలంగాణలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కొంతమంది మంత్రులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు అయితే దాదాపు అందరూ వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. తాజాగా మహబూబాద్ జిల్లా మహబూబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయనకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కొద్ది రోజులుగా తన తో కాంటాక్ట్ అయిన వారిని క్వరెంటైన్ లో వేల్లలాని ఆయన కోరారు. అలానే లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా టెస్ట్ చేయించుకోమని ఆయన కోరారు