BBLలీగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌ …!

-

పురుషుల క్రికెట్లోనే కాదు… విమెన్‌ క్రికెట్లో కూడా ఫీల్డింగ్‌, ఆశ్చర్యపర్చే క్యాచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. IPL త‌ర‌హాలో జరుగుతున్న విమెన్స్ BBL లీగ్‌లో ఓ అద్భుత‌మైన ఫీల్డింగ్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్రిస్బేన్ హీట్ వుమెన్‌ వ‌ర్సెస్ అడిలైడ్ స్టైకర్స్‌ వుమెన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో తాలియా మెక్‌గ్రాత్ అద్భుత‌మైన క్యాచ్ పట్టింది.

అడిలైడ్ బౌల‌ర్ అమండా వేసిన ఫుల్ టాస్ బంతిని… బ్రిస్బేన్ ప్లేయ‌ర్ అమేలియా భారీ షాట్‌ కొట్టింది. అయితే షార్ట్ మిడ్ వికెట్ మీదుగా గాల్లో వెళ్తున్న ఆ బంతిని మ్యాడీ పెన్ని అందుకునే ప్రయత్నం చేసింది. బంతి ఆమె చేతుల‌కు త‌గ‌లి కింద ప‌డ‌బోయింది. అంతలోనే ఆ ఫీల్డర్‌ అయిన తాలియా మెక్‌గ్రాత్ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news