నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది…శంతను హజారిక ఆర్ట్స్‌ పై స్పందించిన శృతిహాసన్..!

-

శృతి హాసన్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం లభించింది. గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో శ్రుతి హాసన్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రుతి హాసన్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటే శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శంతను హజారిక చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే.

తాజాగా శంతను హజారిక కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్‌ చేశారు. ఈ డిజైన్స్‌ను చూసి తెగ మర్చిపోయిన శృతి హాసన్ సోషల్‌ మీడియాలో శంతను హజారిక గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది అని శృతి హాసన్ అన్నారు. ఇలా శృతి హాసన్, శంతను హజారిక తాజా ఆర్ట్స్‌ పై స్పందించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version