లిక్కర్‌ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి సతీమణి ప్రమేయం..!

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి సతీమణి కనికా టెక్రివాల్‌ నేతృత్వంలోని జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ నడిపిన ఛార్టర్డ్‌ విమానాల వివరాలను నెలరోజుల క్రితమే ఈడీ సేకరించింది.

మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత సిండికేట్‌లో కీలక పాత్ర పోషించిన సౌత్‌ గ్రూప్‌ సిండికేట్‌ సభ్యులు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌తోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి దిల్లీకి వచ్చి మద్యం విధానంలో కీలకపాత్ర పోషించినట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో జెట్‌ సెట్‌ గో సంస్థ నడిపిన విమాన వివరాలను ఈడీ గత నెల 17న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసి తెప్పించుకుంది. జెట్‌ సెట్‌ గో ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు వివరాలను సేకరించింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మేనేజర్ల వివరాలను తీసుకుంది. మనీ లాండరింగ్‌ యాక్ట్‌-2002లోని నిబంధనల మేరకు జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆ వివరాలను సేకరిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news