జగన్ కి షాక్ ఇవ్వబోతున్న షరీఫ్ ?

-

వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు శాసనమండలి చైర్మన్ షరీఫ్. సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందు ప్రకటించిన షరీఫ్ తర్వాత అధికార పార్టీ వైసీపీ నుండి ఒత్తిడి రావడంతో ఆ విషయంపై సైలెంట్ అయిపోయారు. దీంతో సెలెక్ట్ కమిటీని నియమించాలని అందుకోసం ప్రక్రియ ప్రారంభించాలని వారం రోజుల కిందట షరీఫ్ ఆదేశించడం జరిగింది.

దీంతో మండలి కార్యదర్శి శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా కమిటీని నియమించక పోవడంతో…షరీఫ్ మండలి కార్యదర్శి పై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సెలెక్ట్ కమిటీ లో ఎవరెవరు ఉంటారో.. చెబుతూ..టీడీపీ నేతలు ఓ జాబితాను చైర్మన్ ఆఫీసులో ఇచ్చింది.

 

ఇప్పుడు బీజేపీ, పీడీఎఫ్ కూడా సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం వహించే తమ సభ్యుల పేర్లను సూచిస్తూ లేఖలు పంపాయి. దీంతో శాసనమండలిలోని మెజార్టీ పక్షాలు సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం వహించేందుకు లేఖలు పంపినట్లయింది. ఇప్పుడు చైర్మన్ జగన్ సర్కార్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చే విధంగా షరీఫ్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version