తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల కీలక ప్రకటన !

Join Our Community
follow manalokam on social media

ముందు నుండీ ప్రచారం జరుగుతున్నట్టు గానే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్టుగా సూచనలు చేశారు. ఈరోజు నల్గొండ జిల్లాకు చెందిన కొందరు వైఎస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఈ సమ్మేళనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుడూ నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తానాని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం లేదని ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన అని, అందుకే నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు.

తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్న ఆమె కచ్చితంగా తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లేని లోటు తెలంగాణాలో కనపడుతుందని అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు. తెలంగాణా క్షేత్ర స్థాయి పరిస్థితులు నల్గొండ జిల్లా నేతలకు తెలుసన్న ఆమె అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టనని అన్నారు. నేటి నుంచి అందరితో మాట్లాడతానని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానాని ఆమె పేర్కొన్నారు.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...