జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో జనసేన నేతలు మరియు కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జనవాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రులు జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని.. అయినప్పటికీ వారిపై కేసులు నమోదు చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విచారణ పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. తీసుక సంబంధం లేని మూడో వ్యక్తి ఎలా పిటిషన్ చేస్తారని…. ఎందుకు నువ్వు మాత్రమే ఎఫ్ ఐ ఆర్ లను రద్దు చేయాలని కోరగలరని వ్యాఖ్యానించింది. ఈ కేసులను మూడో వ్యక్తి సవాలు చేయడానికి అనుమతిస్తే ఇకపై అలాంటి పిటిషన్లు దాఖలయ్య ప్రమాదం ఉందని జనసేనకు షాక్ ఇచ్చింది. అనంతరం ఈ కేసును మరో రెండు వారాలకు వాయిదా వేసింది హై కోర్ట్.