షర్మిల నా మరదలు : నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు షర్మిల టీం వార్నింగ్ !

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను మరదలు అని సంబోదించిన మంత్రి నిరంజన్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి. షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

షర్మిలను మంగళవారం మరదలు అంటూ మాట్లాడి మంత్రి నిరంజన్ రెడ్డి మహిళలను అగౌరవపరిచారని.. మంత్రి నిరంజన్ రెడ్డి నాలుక కోస్తామని హెచ్చరించారు. టీఆరెస్ నేతలు హుందాతనం గురించి మాట్లాడం సిగ్గుచేటు అని.. మహిళలను చిన్నచూపు చూడటం టీఆరెస్ నాయకుల సంస్కృతి అని మండిపడ్డారు.

మహిళలకు తెలంగాణ లో ప్రాతినిధ్యం కల్పించలేని వీరు షర్మిల గురించి మాట్లాడటం బాధాకరమని.. షర్మిల కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అధికారమదంతో పిచ్చిపట్టి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని.. అధికారం చేతకాక ప్రశ్నించేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అగ్రహాం వ్యాఖ్యమ చేశారు. మంత్రి తన ప్రవర్తనని మార్చుకోకపోతే కళ్ళల్లో కారం కొట్టి తరమికొడుతామని హెచ్చరించారు.