విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..6.50 లక్షల మంది కి ల్యాప్ టాప్ లు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ తీపి కబుర్ చెప్పింది. ఏపీ లో చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లను ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మ ఒడి మరియు జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న విద్యార్థు ల్లో కొందరు పథకాల డబ్బుకు బదులు ల్యాప్ టాప్ లను కావాలని ఆప్షన్ ఇచ్చారు.

ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారీ సంఖ్య 6.53 లక్షల మంది విద్యార్థులు. అయితే వీరందరికీ… ల్యాప్ టాప్ లు ఇవ్వాలని తాజాగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. 6.53 లక్షల లాప్ టాప్ లను కొనుగోలు చేసే బాధ్యతలను… ఏపీ టి ఎస్ నోడల్ ఏజెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. లెనోవో, hp, Dell, acer ఇలాంటి బ్రాండెడ్ ల్యాప్ టాప్ లను విద్యార్థులకు ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక సర్కార్ నిర్ణయం పై విధ్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.