బనకచర్లపై షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.7 నుంచి 41.15 తగ్గించి చేసిన అన్యాయంపై అటెన్షన్ డైవర్ట్ చేయడానికే బనకచర్ల ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. బనకచర్ల కు ఫారెస్ట్ అనుమతులు రావడం అసాధ్యం అని చంద్రబాబు గారికి తెలుసు అని చురకలు అంటించారు. అయినా అడ్వాన్స్ మొబైలైజేషన్ కింద నిధుల సమీకరణ చేయడమే వెనకున్న అజెండా. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్నారు.
కేవలం 25వేల కోట్ల మిగులు కోసం ప్రాజెక్ట్ ను ముంచేశారు. R&R ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారు. 2019 లెక్కల ప్రకారం పోలవరం అంచనా రూ.55 వేల కోట్లు. 2024లో సవరించిన అంచనా రూ.30వేల కోట్లు. ఇందుకోసం 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు ఎత్తు తగ్గించి రూ.25 వేల కోట్లు మిగిల్చారు. ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి చెందిన ఒక్క MP కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక బ్యారేజ్ గా మార్చారు. గ్రావిటీ ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మార్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లే అని వెల్లడించారు షర్మిల.