ఇది నా తెలంగాణ..ఎవడ్రా అడిగేది నన్ను – షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

ఇది నా తెలంగాణ..ఎవడ్రా అడిగేది నన్ను అంటూ వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR పాలనలో రుణమాఫీ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. పక్కా ఇండ్లు లేవు. ఆరోగ్యశ్రీ లేదు. ఉద్యోగాలు లేవు. పోడు పట్టాలు లేవు. మహిళలకు రుణాలు లేవు… ఇలా ఎన్నో పథకాలను అటకెక్కించాడని మండిపడ్డారు. YSR సంక్షేమ పాలన సాధించి, మళ్లీ మంచి రోజులు తీసుకురావడమే మా లక్ష్యమని వివరించారు వైఎస్‌ షర్మిల.

నేను ఇక్కడ పెరిగిన.. ఇక్కడ చదువుకున్న.. ఇక్కడ పెండ్లి చేసుకున్న.. నా బతుకు ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. అలాంటప్పుడు ఇది నా తెలంగాణ కాకుండా ఎట్లవుతది? ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత కాదా? ఎవడ్రా అడిగేది నన్ను? అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారం. ప్రతి ఒక్కరి బాధలు వింటాం. వెన్ను తట్టి భరోసా కల్పిస్తాం. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరువ్యాపారులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version