షారుఖ్ ఖాన్ “జవాన్” తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ !

-

ఈ రోజు ఎన్నో అంచనాలతో థియేటర్ లలోకి అడుగుపెట్టిన సినిమా “జవాన్”, ఇందులో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా.. ఇతనికి తోడు దీపికా పడుకునే , నయనతార, విజయ్ సేతుపతి తదితరులు నటించారు. ఇప్పటి వరకు అపజయం అంటే ఏమిటో ఎరుగని డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను ఎంతో ఫాషన్ గా తెరకెక్కించాడు. అట్లీ సినిమాలు అనీ ఒక పంథాలో సాగుతాయి.. ముఖ్యంగా రేసీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడి ఆలోచనలకూ పదునుపెడతాయి. ఇక ఈ సినిమాలో అట్లీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అవినీతి వంటి రియల్ లైఫ్ అంశాలను ఆధారాంగా చేసుకుని తెరకెక్కించిన జవాన్ మూవీ ప్రతి ఒక్క మనిషి బుర్రలోకి వెళ్ళినట్లే తెలుస్తోంది. సినిమా ఆద్యంతం మాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఘట్టాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్విస్ట్ లు , క్లయిమాక్స్ లు ఇలా అన్నీ సినిమా సక్సెస్ కు దోహదపడ్డాయి.

ఇక ఈ సినిమా ఎప్పటిలాగే మాస్ ప్రేక్షకులకు మాత్రమే అన్న బోర్డు సరిగా సరిపోతుంది. ఇక ఇప్పటికే తమిళ డైరెక్టర్ నుండి వచ్చిన జైలర్ మూవీ అత్యధిక కలెక్షన్ లను అందుకుని సంచలననం సృష్టించగా, అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ ఏ మేరకు కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news