రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. రూ.15000 జీతం ఇస్తుంది.. అవి కూడా సమయానికి ఇవ్వడం లేదు. వారు చాలా కష్టపడుతున్నారు. కష్టపడేవారికి ఫలితం లేకుండా పోయింది రాష్ట్రంలో అని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
మరోవైపు ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి దాదాపు 5 నెలల జీతాల పెండింగ్ లు ఉన్నాయి. స్కూల్ ఫీజులు అడ్డగోలుగా పెరిగిపోయాయి. స్కూల్ ఫీజులపై నియంత్రణ లేదన్నారు. ఒక్కరోజుకు సుతారి పనికి పోయినా 1200 వస్తున్నాయి. మేస్త్రీ కింద పారా పని చేసే వారికి కూడా దాదాపు రూ.1000 వరకు వస్తున్నాయి. కానీ హోంగార్డుల జీతం రోజుకు రూ.900. ప్రభుత్వం అర్థం చేసుకొని హోంగార్డుల సమస్యలను పరిస్కరించాలని కోరారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వంలో అందరి సమస్యలను పరిస్కరిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా