రికార్డ్స్ దుమ్ము రేపుతున్న పఠాన్! బాలీవుడ్ లో నవ్వు ముఖం.!

-

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో , దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన పఠాన్ చిత్రం నిన్న దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు మూడు ఏళ్ల పాటు షారుక్ ఖాన్ చాలా కష్ట పడ్డాడు. తన గత సినిమా జీరో తో నిజంగానే జీరో స్థాయికి పడి పోయాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సినిమా వస్తుంది అంటే ఆ సందడి వేరే లాగా ఉండేది.

ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వసూళ్ళు తో ముందుకు దూసుకు పోతుంది. అసలు ఈ సినిమా పై ముందు బాయ్ కాట్ చేయాలని గోల గోల చేశారు. కాని వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ వసూళ్ల దుమ్ము దులుపుతోంది అని ట్రేడ్ వర్గాలు రికార్డ్స్ చెబుతున్నాయి.

ఈ సినిమా మొదటి రోజు వసూళ్ళు బయటకి వచ్చాయి. మొదటి రోజు వసూళ్ళు  `కేజీఎఫ్ 2`ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది. యష్ నటించిన ఈ మూవీ హిందీ వెర్షన్ తొలి రోజు 54 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి టాప్ డే వన్ గ్రాసర్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆ రికార్డును ఏ హిందీ సినిమా కొట్టలేకపోయింది. తాజాగా షారుక్ నటించిన `పఠాన్` ఫస్ట్ డే కు అంతకంటే ఎక్కువగా 55 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 100 కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది  ఇది షారుఖ్ ఖాన్ తో పాటు, బాలీవుడ్ కు పూర్వ వైభవం వచ్చేలా చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news