ఎట్టకేలకు షారుక్ ఖాన్ మొదలెట్టనున్నాడు..

బాలీవుడ్ ఖాన్ త్రయం సినిమాల జోరు చాలా తగ్గింది. సల్మాన్ ఖాన్ తప్ప మిగతా ఇద్దరూ సినిమాలే చేయట్లేదు. ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు. ఇక షారుక్ ఖాన్, ఏకంగా రెండున్నర సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తాజాగా కొత్త సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. జీరో సినిమా బాక్సాఫీసు వద్ద తేలిపోయిన తర్వాత షారుక్ ఖాన్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. కొత్త కథలని తీసుకొచ్చే ఉద్దేశ్యంతో రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసాడు.

ప్రస్తుతం పఠాన్ సినిమా పట్టాలెక్కనుంది. షారుక్ తో పాటు జాన్ అబ్రహం కూడా ఒకానొక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఫీమేల్ లీడ్ గా దీపికా పదుకునే మెరవనుంది. నవంబరు చివరి వారంలో షూటింగ్ కి వెళ్ళనున్న ఈ సినిమాని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయనున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మాణంలో పఠాన్ మూవీ తెరకెక్కనుంది. మరి రెండున్నర సంవత్సరాల తర్వాత షారుక్ కెమెరా ముందుకు రాబోతున్న తరుణంలో అభిమానులంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.