టాలీవుడ్ స్టార్లకు టోకరా.. శిల్పా చౌదరి దంపతులకు 14 రోజుల రిమాండ్

-

అధిక వడ్డీతో టాలీవుడ్ స్టార్లకు టోకరా వేసిన శిల్పా చౌదరి పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని పేర్కొన్నారు జడ్జి. దీంతో వారిని జైలుకు తరలించారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజిన శిల్పా.. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడింది.

రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా వసూలు చేసిన శిల్పా.. డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బౌన్సర్ తో బెదిరించిన శిల్పా… డబ్బుల కోసం ఇంటికి వెళితే బౌన్సర్ తో బెదిరించి పరుగులు పెట్టించింది. డబ్బులు ఇవ్వమని అడుగుతే ప్రముఖుల పేర్లు చెప్పి బెదిరింపులకు శిల్ప పాల్పడినట్లు… బాధితురాలు దివ్య రెడ్డి పేర్కొంది. డబ్బులు ఇవ్వకుండా ఫోన్ లో చాలా సార్లు చంపేస్తానంటూ బెదిరింపులకు శిల్పా దిగిందని… శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది దివ్య రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version