నా డబ్బులే.. ఎవరు ఇవ్వలేదు : శిల్పా చౌదరి సంచలనం

కిట్టి పార్టీల పేరుతో ప్రముఖులను బురిడి కొట్టిచ్చిన శిల్ప చౌదరి ని ఇవాళ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు విషయాలను పోలీసులు చెప్పింది శిల్ప.. తాను ఎక్కడికి పారిపోలేదని…. ఆరుగురు దగ్గర నుంచి తాను రుణాలు తీసుకున్నానని తెలిపింది. చాలా మంది తనకు బ్లాక్ మనీని వైట్ గా చేయమని ఇచ్చారని సంచలన విషయాలు బయట పెట్టింది.

చాలా వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని.. రియల్ ఎస్టేట్ లో పెట్టిన డబ్బులు ఇంకా తిరిగి రాలేదని క్లారిటీ ఇచ్చింది శిల్ప చౌదరి. చాలా మంది ప్రముఖులు దగ్గర ప్రముఖులు తనకు డబ్బులు ఇచ్చారని.. తాను ఎవరిని మోసం చేయాలని ఎప్పుడు ఆలోచన లేదని పేర్కొంది శిల్ప చౌదరి. అందరి డబ్బులు కూడా తాను త్వరలోనే తిరిగి ఇస్తాను.. సినిమా హాలు, ఆసుపత్రులు, కొన్ని నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టానన్నారు శిల్ప చౌదరి. తన దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తిరిగి ఇవ్వలేదని.. డబ్బులు ఇవ్వకపోవడంతో నేను మిగతా వాళ్లకు చెల్లించ లేకపోయానని పోలీసులకు వివరించింది శిల్ప చౌదరి.