కేంద్ర ప్రభుత్వం తో జరగబోయే చర్చ లలో తమ డిమాండ్ల ను అంగీకరిస్తే.. తమ పోరాటాన్ని నిలిపేస్తామని రైతు ఉద్యమ నేత రాకేష్ టీకాయత్ ప్రకటించారు. ఈ చర్చ లలో పంట కు కనీస మద్దత్తు ధర తో పాటు మరి కొన్ని డిమాండ్ల ను కేంద్రం అంగీకరిస్తే తమ ఉద్యమాన్ని నిలిపేసి తమ ఇళ్లలకు వెళ్తామని అన్నారు. కాగ రైతు సంఘాల నాయకుల తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపటానికి ఇరువురు అంగీకరించారు. అంతే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం తో జరగబోయే చర్చ ల కోసం రైతు సంఘాలు ఇప్పటి కే ఒక కమిటీ ని కూడా ప్రకటించాయి.
ఈ కమిటీ లో మొత్తం ఐదుగురు సభ్యలు ఉన్నారు. అయితే ఈ చర్చ లలో కేంద్ర ప్రభుత్వం ముందు ఎంఎస్పీ తో పాటు చనిపోయిన 702 మంది రైతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని. అలాగే ఉద్యమం లో రైతుల పై పెట్టిన కేసులను అన్నింటిని కూడా ఎత్తి వేయాలని.. వంటి డిమాండ్ల తో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. అయితే ఈ చర్చ లు సఫలం అయితే తమ పోరాటాన్ని నిలిపివేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాకేష్ టీకాయత్ ప్రకటించడం తో ఈ చర్చ లపై ప్రాధాన్యత సంతరించుకుంది.