కండోమ్స్ ఫర్ మెన్ అండ్ విమెన్… ఆడ, మగ వారికి ఎవరైనా వాడేలా…

-

కండోమ్స్ ఒకప్పుడు దీన్ని ఓ భూతులాగా చూసేవారు. అలాంటి ఇటీవల కాలంలో చాలా మంది వినియోగిస్తున్నారు. పిల్లలను లేట్ గా ప్లాన్ చేసుకోవాలని చూసేవారితో పాటు… ఎయిడ్స్ వంటి సుఖ వ్యాధులు రాకుండా ప్రస్తుత కాలంలో వాడుతున్నారు. 1855 లో తొలిసారిగా కండోమ్ వాడకాన్ని తీసుకువచ్చారు. మొదట రబ్బరుతో తయారు చేసేవారు అయితే ఇవి గర్భనిరోధకానికి అంతగా ఉపయోగపడేవి కావు.. అయితే ఆతరువాత 1920లో లేటెక్స్ రకం కండోమ్స్.. ఆ తరువాత 2008 నుంచి పాలిసోప్రేన్ రకం కండోమ్స్ వాడుకలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రెండు రకాల కండోమ్స్ వాడుకలో ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ఆడ, మగ ఎవరైనా వాడేలా ఒకే రకం కండోమ్స్ వచ్చాయి. వీటిని ఆడ, మగ ఇద్దరూ వాడవచ్చు. దీన్ని మలేషియాకు చెందిన టాన్ జాంగ్ అనే గైనకాలజిస్ట్ మెన్, విమెన్ వాడేలా ఇద్దరికి ఒకే రకం కండోమ్ ను తయారు చేశారు. దీని వల్ల వంద శాతం గర్భనిరోధకానికి సాధ్యం అవుతుందని ఆయన అంటున్నారు. సాధారణంగా లెటెస్ట్ కండోమ్ వాడితే చాలా మందికి అలర్జీ వస్తుంది. అయితే దీన్ని పాలియురేథేన్ తో తయారు చేశారు. దీంతో అలర్జీలు వచ్చే అవకాశం తక్కువ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకం కండోమ్ లు మలేషియాలోనే దొరుకుతున్నాయి. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news