బీఆర్ఎస్ పార్టీకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇవ్వనున్నారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదివరకే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, మాజీ ఎంపీలు బీఆర్ఎస్‌ను పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. తాజాగా మాజీ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో బీజీపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు హోం మినిస్టర్ అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం అయిన తర్వాత పార్టీ నేతలతో భేటీ అయి రాబోయే లోక్సభ ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లో హోమ్ మినిస్టర్ అమీత్ షాను బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలవనున్నట్లు సమాచారం. బిజెపి పార్టీలో చేరి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ను ఆరూరి రమేష్ కోరనున్నట్లు కోరనున్నట్లు తెలుస్తోంది.