బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార సమితి : అమిత్ షా

-

తెలంగాణలో ఎంపీ ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. ఈ క్రమంలో ఆయా క్లస్టర్లలో విజయ్ సంకల్ప్ యాత్ర పేరుతో ప్రాచారం నిర్వహించారు. అలాగే బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన సభను హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు.


ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ రాజకీయం కొనసాగుతుందని.. ఈ కారణంగా బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారిన సంచలన ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామాకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను, యువతను దారుణంగా మోసం చేసిందని.. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార సమితి అని.. అమిత్ సా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news