విరాట్ కోహ్లి ఫ్యాన్స్ కి బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్‌లో ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్‌లు విరాట్ కోహ్లికి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కింగ్ కోహ్లిని ఒప్పించే బాధ్యతలు అజిత్ అగార్కర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కి విరాట్ కోహ్లి దూరంగా ఉంటారని వార్తలు వస్తుండటంతో కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 2022 T20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్ విరాట్ కోహ్లిని పక్కన పెడితే టోర్నీని గెలవలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ లలో అత్యధిక రన్స్ చేసింది వీళ్లే.. 2007-గౌతమ్ గంభీర్, 2009-యువరాజ్ సింగ్, 2010-సురేష్ రైనా, 2012 & 2014 & 2016 & 2022 లో కింగ్ విరాట్ కోహ్లీ ,2021లో రాహుల్ .