తెలంగాణ మందుబాబులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండా కాలం వచ్చిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో పెరిగిన బీర్ల ధరలు నేటి అంటే మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై ఏకంగా 15 శాతం పెంచింది. అంటే… తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో బీరుపై రూ.30 పెరిగే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంటే లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కానుంది. స్ట్రాంగ్ బీరు రూ.160 నుంచి రూ.200 కానుంది.
- తెలంగాణలో బీర్ల ధరలు పెంపు
- బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ
- నేటి నుంచే అమలులోకి రానున్న కొత్త ధరలు