ఒక్కొక్కరి చర్మం ఒక్కొలా ఉంటుంది..చర్మనికి తగినట్లు మార్కెట్ లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి.ముఖానికి వేరు, శరీరానికి వేరుగా సబ్బులు ఉంటాయని నిపుణులు అంటున్నారు.మన శరీరాన్ని, ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం సబ్బు వాడుతుంటాం. మార్కెట్లోనూ చాలా రకాల ఫ్లేవర్స్ తో చాలా రకాల కంపెనీల సబ్బులు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు.. మన చర్మం తీరుని బట్టి కూడా రకరకాల సోప్స్ ఉన్నాయి. అయితే.. మన శరీరానికి సూట్ అయ్యే సబ్బు.. ముఖానికి సరిపోదట. ఈ రెండింటి అవసరాలు వేర్వేరుగా ఉంటాయట. అందుకేనేమో.. మనం ముఖ సంరక్షణకు సబ్బు వాడకపోవడమే బెస్ట్.. చాలా స్కిన్‌కేర్ బ్రాండ్లు పూర్తిగా ముఖం కోసం తయారు చేసిన సబ్బులతో వస్తున్నాయి.
హైపోఅలెర్జెనిక్, సువాసన లేని , చర్మాన్ని తేమగా ఉండే వాటిని మాత్రమే ఉపయోగించండి. ఫేస్ సోప్‌లలో ప్రత్యేకంగా సిరామైడ్లు, నియాసినామైడ్, గ్లిసరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉండాలి, ఇవన్నీ మన ముఖ చర్మానికి అద్భుతాలు చేస్తాయి. అలా కాకుండా.. శరీరానికి, ముఖానికి ఒకే రకం సోప్ వాడటం వల్ల చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు..
సబ్బు పట్టీని నేరుగా ముఖంపై రుద్దడం వల్ల కఠినంగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై గీతలు లాంటివి పడే అవకాశం ఉంది.రసాయనాలతో నిండినందున, సబ్బులు చర్మం నుండి తేమ మొత్తాన్ని తొలగించి పొడిగా మార్చుతాయి..ఇవి మీ ముఖ సున్నితమైన చర్మాన్ని చికాకుపరుస్తాయి. ఇది మొటిమలు, దీర్ఘకాలంలో ముడతలు రావడానికి కారణమౌతాయి..అంతేకాదు వీటిని శరీరం యొక్క మురికిని పొగొట్టటం కోసం వాడతారు. సబ్బులలో pH విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేరుగా అప్లై చెయ్యకూడదు.
జెల్ క్లెన్సర్లను ఎంచుకోవాలి. జెల్ క్లెన్సర్లు కూడా రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తాయి. అదనపు నూనెను తొలగిస్తాయి… అలాగే క్రీమ్ క్లెన్సర్లు ముఖం చర్మంపై అవసరమైన మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి..
ఆయిల్ క్లెన్సర్లు బ్లాక్‌హెడ్స్ , వైట్‌హెడ్స్‌కు కారణమయ్యే రంధ్రాలను అన్‌లాగ్ చేస్తాయి..అందుకే ఎక్కువ సార్లు ముఖం కడిగే వారు వీటిని తప్పక తెలుసుకోవాలి..డైరెక్ట్ గా మాత్రం ఎప్పుడూ అప్లై చెయ్యకండి.. డేంజర్.. ముఖం పూర్తిగా పాడైయ్యే అవకాసముంది.. బీ కేర్ ఫుల్..