తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కనపడకుండా పెరుగుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణంలో పార్టీ నేతలు ఎవరు అయినా సరే కింది స్థాయి కార్యకర్తలను కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జవసత్వాలు నింపాలి అంటే కొందరు నేతలు అవసరం.
అందులో యువనేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో కొందరు నేతల వ్యవహారశైలి ఇప్పుడు భయపెడుతుంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో మాజీ మంత్రి నారా లోకేష్ కాస్త దూకుడుగా ఉన్నారని అమరావతి ఉద్యమంలో ఆయనకు ఎక్కువగా పేరు వచ్చింది అనే అసహనం ఆయనలో ఎక్కువగా ఉందని సమాచారం. ఇక పార్లమెంట్ ప్రసంగాలలో ఆయన బాగా ప్రభావం చూపిస్తున్నారు.
గల్లా ప్రసంగాలకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అయి ఉంటే బాగుంటుంది అనే దాని మీద లోకేష్ ఒక సర్వే నిర్వహించారు. తనతో సన్నిహితంగా ఉండే ఒక సోషల్ మీడియాకు చెందిన వ్యక్తి ద్వారా రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనే సర్వే నిర్వహించగా… పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ అయితే బాగుంటుంది అని కొందరు చెప్పారు,
రాష్ట్ర పార్టీ బాధ్యతలను రామ్మోహన్ నాయుడు కి ఇస్తే బాగుంటుంది అని కొందరు చెప్పారు. లోకేష్ కి ప్రజల్లో ఇమేజ్ లేదని కాబట్టి ఆయన తెర వెనుక ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్త౦ అయింది. ఇక ఇతరపార్టీ లలో ఉండే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. దీనితో లోకేష్ లో మరింత అసహనం పెరిగింది అంటున్నాయి రాష్ట్ర పార్టీ వర్గాలు.