శోభనం గదిలో పెళ్లి కొడుకు షాక్!

సందడి సందడిగా బంధుగణం సమక్షంలో వైభవంగా పెళ్లయింది. పెళ్లి కొడుకు శోభనానికి రెడీ అయ్యాడు. కానీ, ఇంతలోనే షాక్. శోభనం గదిలోకి పెళ్లి కూతురుకు బదులు పోలీసులు రావడంతో కంగుతిన్నాడు వరుడు. మళ్లీ పెళ్లి చేస్తామంటూ లాఠీ చూపించి తీసుకెళ్లారు పోలీసులు.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మిట్టమిరిపురం గ్రామానికి గణేష్, బెంగళూరుకు చెందిన శ్రావణి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా గణేష్ స్వగ్రామంలో ఉంటున్నా, శ్రావణితో ఫోన్లో, వీడియో కాల్తో టచ్లో ఉన్నాడు. ఇంతలో బంధువుల అమ్మాయితో గణేష్ కు పెళ్లి కుదిరింది. ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకున్నాడు. శోభనానికి సద్ధమయ్యాడు. ఇంతలో విషయం తెలుసుకున్న శ్రావణి బెంగళూరు నుంచి గణేష్ ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేసింది. తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని నిలదీసింది. ఇన్ని రోజులు తనతో కలిసి తిరిగి ఇప్పడు వేరే పెళ్లి చేసుకోవడమేంటని గోడవ చేసింది. గణేష్ లేకపోతే తాను బతకలేనని ఏడ్చింది. తాను మోసపోయాయని న్యాయం చేయాలని వేడుకుంది. ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీ వీడియోలు బయటపెట్టింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంటి ముందు లవర్ శ్రావణిని చూసిన గణేష్ షాక్ అయ్యాడు. శోభనం గది నుంచి పారిపోయాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. శ్రావణి అంటే తనకు ఇష్టమేనని, బంధువుల ఒత్తిడితోనే తాను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని గణేష్ చెప్పినట్లు తెలిసింది.