టీఆర్ఎస్ TRS పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా కూడా ఈటల రాజేదర్‌కు అన్ని పార్టీల నుంచి మద్దతు వస్తూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కీలక నేతలు కూడా ఆయన్ను సపోర్టు చేస్తుండగా ఇప్పుడు టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు కూడా కొందరు ఇన్ డైరెక్టుగానే సపోర్టుచేస్తుంటే మరి కొందరు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇందుకోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు.
ఎందుకంటే ఈటల రాజేందర్‌కు అన్ని పొలిటికల్ పార్టీల నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి మచ్చ లేని నాయకుడిగా ఆయనకు మొదటి నుంచి అందరితో మంచి సంబంధాలు ఉన్న నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. ఇక బర్తరఫ్ చేసిన తర్వాత కూడా రాజేందర్‌కు ఎంతోమంది మద్దతు పలుకుతూనే ఉన్నారు. కాగా ఇప్పుడు మరో కీలక నేత ఆయనకు మద్దతుగా మాట్లాడటం సంచలనం రేపుతోంది.
ఇక ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు ఇప్పుడు ఈటలకే తన సపోర్టు ఉంటుందని చెప్పారు. తన నిర్మల్ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేస్తున్న ఆయన ఇప్పుడు ఆయన వల్లే నిర్మల్ పట్టణం మునుగిందన్నారు. ఆయన చెరువుల్ని కబ్జా చేస్తే ఆ నీళ్లన్నీ పట్టణంలోకి వచ్చాయన్నారు. ఇలా కబ్జాలు చేస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోకుండా ఈటలపై ఎలా తీసుకున్నారంటూ మండిపడ్డారు. అందుకే తన మద్దతు ఈటలకు ఉంటుందని చెప్పడంతో టీఆర్ ఎస్‌కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది.