బెంగళూరు: కర్ణాటక సీఎంగా యడియూరప్ప రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన రెండేళ్ల పాలనపై వేడకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యడియూరప్ప పాల్గొన్నారు. పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఒక్కసారిగా యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెప్పారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను ప్రజల కోసం పని చేశానని వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశానని పేర్కొన్నారు. పోరాటంలో ఒంటరినై పోయానని బాధపడలేదన్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తానని యడియూరప్ప తెలిపారు.
కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా… రెండేళ్ల పాలన వేడుకలో భావేద్వేగం
-