ఏంటి షాక్ అయ్యారా..?? అవును మీరు విన్నది నిజమే ఆ కుక్క వయసు సుమారు 18 వేల సంవత్సరాలు.ఈ కుక్కని చూసిన ఎవరైనా సరే షాక్ అవ్వక మానరు. అదేంటి ఒక కుక్క జీవిత కాలం మహా అయితే 10 నుంచీ 15 ఏళ్ళ లోపు ఉంటుంది అది కూడా ఎక్కువే మరి అలాంటిది 18 వేల ఏళ్ళు ఎలా బ్రతికింది అనే సందేహం కలుగక మానదు. అయితే ఈ కుక్క బ్రతికి లేదు చనిపోయింది. కానీ దాని కళేబరం చూస్తే మాత్రం బాగా మత్తుగా నిద్ర పోతుందా అనే సందేహం మాత్రం కలుగుతుంది. అసలు విషయం ఏమిటంటే..
సైబీరియాలో మంచు కొండల్లో ఇద్దరు శాస్త్రవేత్తలకి ఈ కళేబరం కనిపించింది. దీనిని చూసిన వాళ్ళు ఇది రెండు రోజుల క్రితం చనిపోయిన నక్క పిల్ల అనుకున్నారు. అయితే అందులో ఒకరు దీనికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని భావించి చేయగా అది నక్క కాదు కుక్క పిల్ల అని తేల్చారు. అంతేకాదు అది చనిపోయి సుమారు 18 వేల ఏళ్ళు గడిచిందని తెలుసుకుని షాక్ అయ్యారు. తమ అంచనాలు తప్పేమో అని భావించి మళ్ళీ వేరే ల్యాబ్ లో పరీక్షలు చేయించగా
అక్కడ కూడా అది కుక్క అని దానికి 18 వేల సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. అయితే కుక్క శరీరం ఏ మాత్రం చెక్కు చెడలేదు సరికదా దాని నోటిలో పళ్ళు కూడా దెబ్బతినలేదు. వెంట్రుకలు ఊడిపోకుండా అలాగే శరీరానికి పట్టుకుని ఉండటం శాస్త్రవేత్తలని ఆశ్చర్యపరుస్తోంది.